బి ఎస్ ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ గా పెద్దాపురం దేవేందర్

 

 

 

 

 

 

 

 

 

(జనంసాక్షి: జోగిపేట్ ఆందోల్) మునిపల్లి మండల బహుజన సంఘర్షణ సమితి రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ గా ముని పల్లి మండలం బుసారెడ్డి పల్లి గ్రామానికి చెందిన పెద్దాపురం దేవేందర్ ను నియమిస్తున్నట్టు బహుజన సంఘర్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఇస్తరి మహేష్ ఈమెయిల్ ద్వారా నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పెద్దాపురం దేవేందర్ మాట్లాడుతూ నన్ను సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ గా నియమించిన తెలంగాణ బహుజన సంఘర్షణ సమితి అధ్యక్షులు ఇస్తరి మహేష్ జిల్లా అధ్యక్షురాలు మనియర్ పల్లి నర్సమ్మ కు ధన్యవాదాలు తెలిపారు. తనపై ఎంతో నమ్మకం ఉంచి రాష్ట్ర కన్వీనర్ గా నియమించినందుకు వారి నమ్మకాన్ని నిలబెడుతూ రాష్టం లో బహుజన సంఘర్షణ సమితి చేస్తున్న పత్రి కార్యక్రమాలను ప్రజలకు తెలిపేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ప్రయోజనాన్ని ప్రతి ఒక్కరికి తెలిసేవిదంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేసేందుకు కృషి చేస్తానన్నారు.