Tuesday, 3 November 2026

బీజేపీకి ప్రత్యామ్నాయంగానే..  జాతీయస్థాయిలో కూటమి

– కూటమి ఏర్పాటు సమయంలోనే చంద్రబాబు పాత్ర ఉంటుంది
– టీడీపీకి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం
– ఏపీ మంత్రి అచ్చెంన్నాయుడు
అమరావతి, నవంబర్‌1(జ‌నంసాక్షి) : బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కూటమి ఉంటుంది కానీ, దానికి అధినేతగా చంద్రబాబునాయుడు ఉండబోరని మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. తమ పార్టీకి రాష్ట్ర ప్రయోజనాలే తప్ప, ప్రధాని పదవి ముఖ్యం కాదని ఆయన అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.. ఈ విషయంలో తమకు అధికారాన్ని అప్పగించిన ప్రజలకు స్పష్టమైన హావిూ ఇస్తున్నామని, బీజేపీకి ప్రత్యామ్నాయంగా మాత్రమే కూటమిని ఏర్పాటు చేస్తున్నామని, అందులో భాగంగానే చంద్రబాబు, రాహుల్‌ గాంధీల మధ్య చర్చలు జరగనున్నాయని తెలిపారు. ఏపీ బాగుండాలనే నాడు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరామని, నమ్మించి మోసం చేసినందున విడిపోయామని
తెలిపారు. ప్రత్యేక ¬దా సహా విభజన హావిూలను నెరవేరుస్తామని కాంగ్రెస్‌ వాగ్దానం చేసినందునే, ఆ పార్టీకి దగ్గరయ్యామని తెలిపారు. ¬దా సాధన రాష్ట్ర ప్రజలందరి కోరికని, చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో పలువురు జాతీయ పార్టీల నేతలు కలసి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అచ్చెన్నాయుడు తెలిపారు. ఏపీకి ప్రత్యేక¬దా, విభజన హావిూలు నెరవేరుస్తామని కాంగ్రెస్‌ చెప్పిందన్నారు. అధికారంలోకి రాగానే ¬దాపైనే తొలి సంతకం చేస్తామని రాహుల్‌ ప్రకటించారని ఆయన గుర్తుచేశారు. రాష్ట్ర ప్రజలు కూడా ప్రత్యేక ¬దా కోరుకుంటున్నారని తెలిపారు. బీజేపీ మోసం చేసింది కాబట్టే కాంగ్రెస్‌తో వెళుతున్నామని ఆయన చెప్పుకొచ్చారు. చంద్రబాబును నమ్మి అన్ని పార్టీల నేతలు కలిసి వస్తున్నారన్నారు. తమది ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ జాతీయభావాలు ఉన్నాయని పేర్కొన్నారు. కూటమి స్వరూప, స్వభావాలపై చంద్రబాబు ఢిల్లీలో చర్చిస్తారన్నారు. రాహుల్‌గాంధీ, ఫరూక్‌అబ్దుల్లా, శరద్‌పవార్‌, ఏచూరి, కారత్‌తో చంద్రబాబు సమావేశమవుతారని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.