బీజేపీకి మరో భారీ షాక్‌..!! : బీఆర్‌ఎస్‌లోకి వివేక్‌ వెంకటస్వామి..!?

హైదరాబాద్‌ : ఒకవైపు ఎన్నికలకు సమాయత్తమవుతున్న తరుణంలో తెలంగాణ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి బీఆర్‌ఎస్‌లోకి చేరేందుకు నిర్ణయించుకున్నట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. ఈ మేరకు ఆ పార్టీ పెద్దలతో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. ఇక చేరికకు ముహూర్తమే తరువాయి. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ పుంజుకునే పరిస్థితి లేకపోవడంతో తన రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా తిరిగి బీఆర్‌ఎస్‌లోకి చేరేందుకు నిశ్చయించుకున్నట్టు సమాచారం. వివేక్‌ బీజేపీ వీడిన వెంటనే మరికొందరు నేతలు కూడా ఆయన బాటలో వెళ్లనున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.