బీజేపీ టీఆర్‌ఎస్‌ రాజకీయ క్రీడ

200కోట్ల విలువైన ధన్యాం వృధా: రేవంత్‌ ట్వీట్‌
హైదరాబాద్‌,జూలై19(జనం సాక్షి): బీజేపీ టీఆర్‌ఎస్‌ రాజకీయ క్రీడలో 2 వందల కోట్లు విలువైన ధాన్యం నీళ్ల పాలైందని పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి అన్నారు. ఇవి మోడీ, కేసీఆర్‌ జేబులో డబ్బులు కాదంటూ ట్వీట్‌ చేశారు. తెలంగాణ ప్రజల రక్తం, చెమట ధారపోసి కట్టిన పన్నుల సొమ్మని రేవంత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు ప్రభుత్వాలకు బాధ్యత లేదంటూ ఫైర్‌ అయ్యారు. ప్రజలను ఆదుకోవడంలో ఇద్దరూ విఫలం అయ్యారని అన్నారు. ఇందులో వారి జేబుల్లోంచి పైసా ఇవ్వడం లేదన్నారు. ఇది గుర్తించి వెటనే సాయం అందించాలన్నారు.