Thursday, 5 November 2026

బీజేపీ నేత కుమారుడి కిడ్నాప్

o3ie75z1హైదరాబాద్,: పాతబస్తీ షంషేర్‌గంజ్‌లో 15 ఏళ్ల బాలుడు శబరీష్‌ అదృశ్యమయ్యాడు. కుమారుడి కోసం చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోవడంతో కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు చివరికి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిని కిడ్నాప్‌గా అనుమానిస్తున్నారు. ప్రత్యేక టీంలతో గాలింపు చర్యలు మొదలుపెట్టారు. మరోవైపు నిన్న రాత్రి శబరీష్‌ను ఇద్దరు వ్యక్తులు రైలు ఎక్కిస్తుండగా చూసిన మహిళ విషయాన్ని బాలుడి తల్లిదండ్రులకు తెలిపింది. శబరీష్‌ను విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కించినట్టు అనుమానిస్తున్న పోలీసులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *