హైదరాబాద్ : దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా గుడిలో బాంబు పెట్టామని గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఉదయం సరూర్‌నగర్ పోలీసులకు ఫోన్ చేసిన విషయం విదితమే. అయితే ఉదయం నుంచి ఆలయం లోపల, పరిసర ప్రాంతాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బాంబు స్వ్వాడ్ తనిఖీలు జరిపింది. తనిఖీల అనంతరం బాంబు లేదని పోలీసులు గుర్తించారు. ఆ ఫోన్ కాల్ నకిలీ ఫోన్ కాల్ అని పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.





