Tuesday, 3 November 2026

బీఫ్‌ పోర్క్‌ ఫెస్టివల్‌ జరగకుండా చర్యలు తీసుకోవాలి : ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు

న్యూఢిల్లీ: జవహర్‌లాల్‌ నెహ్రూె విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) ప్రాంగణంలో బీఫ్‌, పోర్క్‌ పుడ్‌ ఫెస్టివల్‌ జరగకుండా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు బుధవారం వర్సిటీ అధికారులను ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. సెప్టెంబర్‌ 28న విద్యార్థులు నిర్వహించ తలపెట్టిన ఎద్దు మాంసం, పంది మాంసం పండగను వ్యతికేకిస్తూ రాష్ట్రీయా గోరక్షణ సేన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. బీఫ్‌ ఫెస్టివల్‌ జరగకుండా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేస్తూ వ్యాజ్యం దాఖలు చేసింది. ఢిల్లీ వ్వవసాయ పశువుల చట్టం ప్రకారం పశుమాంసాన్ని వండి, వడ్డిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించే వీలుందని పిటిషనర్‌ తరపు న్యాయవాది పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *