బీసీల జోలికొస్తే కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తాం : మంత్రి తలసాని

హైదరాబాద్‌ (జనం సాక్షి )  : రాజకీయాల్లో విమర్శలు సహజం. విషయ పరంగా ఆరోపణలు, ప్రత్యారోపణలు చేయడం ప్రజాస్వామ్యంలో భాగమే. కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ దూషణలకు దిగడం మంచి పద్ధతి కాదని మంత్రి తలసాని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నేతలు బీఆర్‌ఎస్‌, బీసీ నేతలను లక్ష్యంగా చేసుకొని వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో బుధవారం మంత్రి తలసాని నివాసంలో బీసీ మంత్రులు గంగుల కమలాకర్‌, శ్రీనివాస్‌ గౌడ్‌ తదితరులు సమావేశమయ్యారు.ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ..ఇటీవల ప్రెస్ మీట్లు పెట్టీ  కాంగ్రెస్‌ నేతలు బీసీ నాయకులను తిడుతున్నారు. మా బీసీ నాయకులకు ఫోన్లు చేసి బెదిరింపులకు దిగుతున్నారు. వెనుకబడిన వర్గాల నాయకులు,  కార్యకర్తల మీద విమర్శలు చేస్తే ఇక ఊరుకోమన్నారు.వాళ్లలాగా మేం పది పార్టీల్లో తిరిగి రాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వారి విషయంలో ఎందుకు మౌనంగా ఉంటుందో సమాధానం చెప్పాలన్నారు. మా జోలికి వస్తే  సహించం. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను ఏకం చేస్తాం. కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని ఆయన తెలిపారు.

తాజావార్తలు