Tuesday, 3 November 2026

బీహార్‌లో ‘మహా’ విజయం

c
– నితీష్‌ హ్యాట్రిక్‌ సీఎం

– జాతీయ స్థాయిలో బలమైన ప్రత్యామ్నాయం అవసరం

– బీహార్‌ ప్రజల ఆత్మగౌరవవిజయం:నితీష్‌

– నితీషే మా ముఖ్యమంత్రి – లాలూ ప్రసాద్‌ యాదవ్‌

– శుభాకాంక్షలుతెలిపిన సీఎం కేసీఆర్‌

-సహనం గెలిచింది.. అసహనం ఓడింది

– బెంగాల్‌ సీఎం మమత బెనర్జీ

పాట్నా నవంబర్‌ 8 (జనంసాక్షి):

బిహార్‌ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మహాకూటమి ఘన విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో.. మొత్తం 243 స్థానాలకు మహాకూటమి 178 స్థానాల్లో సంచలన విజయం సాధించి భారీ మెజార్టీని నమోదు చేసింది. ఎన్డీయే కూటమి 58 స్థానాల్లో మాత్రమే విజయం సాధించడం గమనార్హం. ఇతర పక్షాలు, స్వతంత్రులు 7 సీట్లలో గెలుపొందారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 40 స్థానాలకు 31 స్థానాల్లో విజయకేతనం ఎగరవేసిన ఎన్డీయే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలయింది.

జాతీయ స్థాయిలో బలమైన ప్రత్యామ్నాయం అవసరం

బీహార్‌ ప్రజల ఆత్మగౌరవవిజయం:నితీష్‌

మహాకూటమి విజయం.. బిహారీల ఆత్మ గౌరవ  విజయమని బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్‌ నేతృత్వంలోని మహాకూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసింది. ఈ సందర్భంగా ఆయన పట్నాలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇంతటి గొప్ప విజయాన్ని అందించిన బిహారీలకు ధన్యవాదాలు తెలిపారు. దళితులు, మహా దళితులు, ఓబీసీ, ఎంబీసీ ఇలా ప్రతిఒక్కరూ తమకు అండగా నిలిచారన్నారు.

ప్రచారంలో అన్ని అంశాలను పరిశీలించిన ప్రజలు వివేకవంతమైన తీర్పు ఇచ్చారన్నారు. ప్రజలు ఇచ్చిన విజయాన్ని వినమ్రంగా స్వీకరిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి వారి రుణం తీర్చుకుంటామని నితీశ్‌ పేర్కొన్నారు. బిహార్‌ ఎన్నికలను బిహార్‌ వరకే చూడకూడదని జాతీయ స్థాయిలో  బలమైన ప్రత్యామ్నాయ అవసరాన్ని ఈ ఎన్నికలు ధ్రువపరుస్తున్నాయన్నారు. రాష్గాభివృద్ధి కోసం ప్రతిపక్షంతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధమని పేర్కొన్నారు. బిహార్‌ సమస్యలపై ప్రతిపక్షంతో కలిసి సర్వసమ్మతితో పరిష్కారాలు కనుగొంటామన్నారు. ప్రతిపక్షాన్ని చులకన చేసే పని తాము ఎప్పటికీ చేయబోమన్నారు.

నితీషే మా ముఖ్యమంత్రి – లాలూ ప్రసాద్‌ యాదవ్‌

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి విజయం సాధించడంతో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌లు ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్నాయి. ఈ సందర్భంగా పట్నాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్‌ మాట్లాడుతూ.. బిహార్‌ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్లీ నితీశే అవుతారని పునరుద్ఘాటించారు.

శుభాకాంక్షలుతెలిపిన సీఎం కేసీఆర్‌

బిహార్‌లో ఘనవిజయం సాధించిన మహాకూటమికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌లకు అభినందనలు తెలియజేశారు. ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నందుకే నితీశ్‌కుమార్‌ ఘనవిజయం సాధించారని కేసీఆర్‌ కొనియాడారు.

సహనం గెలిచింది.. అసహనం ఓడింది

– బెంగాల్‌ సీఎం మమత బెనర్జీ

బిహార్‌ ఎన్నికల ఫలితాల్లో మహాకూటమి ఆధిక్యంలోకి రావడంతో బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌కి, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌లకి పశ్చిమ్‌బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  అభినందనలు తెలిపారు. సహనం గెలిచింది.. అసహనం ఓడిందంటూ ఆమె వ్యాఖ్యానించారు.

మహాకూటమిగా జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌

ఎన్డీయే వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఆలోచనతో ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్‌లు మహాకూటమిగా అవతరించాయి. 178 స్థానాలు గెలిచి మూడింట రెండొంతుల మెజార్టీని సాధించాయి. ఆర్జేడీ ‘లాంతరు’ వెలుగులో, జనతాదళ్‌ యునైటెడ్‌ నేత, బిహార్‌ సీఎం నితీశ్‌ గురిపెట్టి కొట్టిన ‘బాణం’ దెబ్బకు భాజపా ‘కమలం’ విలవిలలాడిపోయింది.

ఓట్ల లెక్కింపు ఆరంభంలో ఎన్డీయే ఆధిక్యం ప్రదర్శించింది. అయితే క్రమంగా మహాకూటమి పుంజుకొని పూర్తి ఆధిక్యం దిశగా దూసుకెళ్లింది. పలు నియోజకవర్గాల్లో నువ్వానేనా అన్న రీతిలో ఓట్ల లెక్కింపు కొనసాగింది. చివరకు మెజార్టీ స్థానాల్లో మహాకూటమి అభ్యర్థులు గెలుపొందారు.

మహాకూటమిలో ఎవరికెన్ని..

మహాకూటమి మొత్తం 178 స్థానాల్లో విజయం సాధించి స్పష్టమైన మెజార్టీ సాధించింది. ఆర్జేడీ 80, జేడీయూ 71 , కాంగ్రెస్‌ 27 స్థానాల్లో విజయం సాధించాయి. జేడీయూ కన్నా ఆర్జేడీ 9 స్థానాల్లో ఎక్కువగా విజయం సాధించడం గమనార్హం. ఈ ఫలితాలను విశ్లేషిస్తే ఆర్జేడీతో పొత్తుపెట్టుకోవడం ద్వారా జేడీయూ గణనీయ ఫలితాలను సాధించిందని అవగతమవుతోంది.

విఫలమైన ఎన్డీయే పక్షాలు

గత పదేళ్లుగా అధికారంలో వున్న నితీశ్‌ ప్రభుత్వ వ్యతిరేక ఓటును అధిగమించి అధికారాన్ని నిలబెట్టుకున్నారు. అయితే ఎన్డీయే పక్షాలు అధికారాన్ని కైవశం చేసుకోవడంలో విఫలమయ్యాయి. గత లోక్‌సభ ఎన్నికల తీరులోనే ఈ ఫలితాలు వుంటాయన్న వారి అంచనాలు తల్లకిందులయ్యాయి. ఎగ్జిట్‌పోల్స్‌ పేర్కొన్నట్టు ¬రా¬రీ పోరుకాకుండా ఏకపక్షంగా పోరు ముగియడం విశేషం.

ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌, జేడీయూ నేత ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌…బీహార్‌ రాజకీయాల్లో కాకలు తీరిన యోధులు. దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు వారు రాజకీయంగా బద్ధ శత్రువులు. బీహార్‌లో గత లోక్‌సభ ఎన్నికల్లో మోది దెబ్బకు ఆర్జేడి, జెడియు కకావికలయ్యాయి. దీంతో బీహార్‌లో తమ ఉనికిని కాపాడుకునేందుకు మత తత్వశక్తులను ఓడించేందుకు తమ మధ్య ఉన్న విభేదాలను పక్కన బెట్టారు. ఇద్దరు మహానేతలు చేతులు కలిపారు.

బీజేపీని ఓడించడానికి మిత్రులుగా మారారు

లోక్‌సభ ఎన్నికల అనంతరం బీహార్‌ లో జరిగిన శాసనసభ ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి వీరివురూ మిత్రులుగా మారిపోయారు. ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ ఇచ్చిన ఇఫ్తార్‌ విందు సందర్భంగా ఇరువురు నేతల మధ్య సఖ్యత కుదిరింది. జెడియు-ఆర్జేడి-కాంగ్రెస్‌లు సెక్యులర్‌ కూటమిగా అవతరించాయి. తామనుకున్న వ్యూహం ఫలించింది. ఉపఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుపొంది సెక్యులర్‌ కూటమి సత్తా చాటడంతో ఇద్దరు నేతల మధ్య స్నేహబంధం మరింత బలపడింది. దాదాపు 24 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఉపఎన్నికల్లో లాలు-నితీష్‌ఒకే వేదికను పంచుకోవడం ద్వారా బీహార్‌ రాజకీయ చరిత్రలో కొత్త అధ్యయనం మొదలైంది.

మహా కూటమిగా జెడియు-ఆర్జేడి-కాంగ్రెస్‌ పార్టీలు

ఉపఎన్నికల విజయంతో బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లోను లాలూ-నితీష్‌లు అదే ఉత్సాహంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. ఆఖరు నిముషంలో జనతాపరివార్‌ నుంచి ములాయం వైదొలగడంతో జెడియు-ఆర్జేడి-కాంగ్రెస్‌ పార్టీలు మహా కూటమిగా అవతరించాయి. సీట్ల సర్దుబాటులో జెడియు-ఆర్జేడి చెరో వంద సీట్లు పంచుకోగా కాంగ్రెస్‌కు 40 సీట్లు కేటాయించారు. సిఎం అభ్యర్థి విషయంలో లాలూ-నితీష్‌లు మధ్య విభేదాలు తలెత్తుతాయని ఎన్డీయే పక్షాలు భావించాయి. గడ్డి స్కాం ఆరోపణలు ఎదుర్కొంటున్న లాలూ పెద్ద మనసుతో ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీష్‌కుమార్‌ను ప్రకటించి ప్రత్యర్థి శిబిరాల్లో గుబులు పుట్టించారు. దమ్ముంటే సిఎం అభ్యర్థిని ప్రకటించాలని లాలూ సవాల్‌ విసిరారు.

అసమ్మతి సెగలు రాకుండా నితీష్‌-లాలూ జాగ్రత్త

సీట్ల పంపకాల్లో ఎలాంటి అసమ్మతి సెగలు రాకుండా నితీష్‌-లాలూ జాగ్రత్త పడ్డారు. బీహార్‌లో బిజెపిని మట్టికరిపించడమే లక్ష్యంగా ఇద్దరు నేతలు పనిచేశారు. ఒకప్పుడు లాలూను జంగల్‌రాజ్‌గా సంబోధించిన నితీష్‌కుమార్‌ ఆయనతో ఎలా చేతులు కలుపుతారని ప్రధాని మోది టార్గెట్‌ చేశారు. నితీష్‌ తెలివిగా మోది విమర్శలను తిప్పి కొడుతూ బిహార్‌లో జరిగిన అభివృద్ధిని ప్రచారం చేశారు. మోది తనపై చేసిన డిఎన్‌ఏ విమర్శను అస్త్రంగా మలచుకుని నితీష్‌ ఎదురు దాడికి దిగారు.

బిజెపిని టార్గెట్‌ చేసిన లాలూ

ఆర్‌ఎస్‌ఎస్‌ లేవనెత్తిన రిజర్వేషన్ల అంశాన్ని మాస్‌ లీడర్‌ లాలూ అనుకూలంగా మలచుకున్నారు. బిజెపి అగ్రవర్ణాల పార్టీగా సంబోధిస్తూ భవిష్యత్తులో బిసి, ఎస్‌సి, ఎస్‌టి రిజర్వేషన్లు కేంద్రం రద్దు చేయనుందని కులాల కార్డును ప్రయోగించి కాషాయదళాన్ని ఆత్మరక్షణలో పడేలా చేశారు. బీఫ్‌ వివాదంపై కూడా బిజెపిని లాలూ టార్గెట్‌ చేశారు.

స్టార్‌ క్యాంపెయినర్లుగా లలూ, నితీష్‌

ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్‌ మహాకూటమి తరపున లాలూ, జేడీయూ నేత, బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్లు స్టార్‌ క్యాంపెయినర్లుగా ప్రచారాన్ని తమ భుజానా వేసుకున్నారు.. లాలూ 250 ఎన్నికల సభల్లో పాల్గొనగా… నితీష్‌ కూడా దాదాపు 200కు పైగా ర్యాలీల్లో పాల్గొన్నారు. వీరిద్దరూ డబుల్‌ సెంచరీలతో ఎన్నికల ప్రచారాన్ని ¬రెత్తించారు. యూపీఏ హయాంలో అవినీతి ఆరోపణలు మూటగట్టుకున్న కాంగ్రెస్‌ నామమాత్రంగానే ప్రచారం నిర్వహించిం. సోనియా, రాహుల్‌ పది పన్నెండు ర్యాలీల్లో మాత్రమే పాల్గొనడం గమనార్హం.

ఒక్కటైన లాలూ, నితీష్‌, కాంగ్రెస్‌

1970 ప్రాంతాల్లో లాలూ, నితీష్‌ లు జనతా పార్టీలో యువనేతలుగా ఎదుగుతున్న క్రమంలో కలిసి పనిచేశారు. ఆ తర్వాత ఇద్దరు నేతలు సొంతంగా పార్టీలను ఏర్పాటు చేసిన తర్వాత బీహార్‌ బరిలో అధికారం కోసం తలపడ్డారు. గత సార్వత్రిక ఎన్నికల్లో మోడీ సారథ్యంలో బీజేపీ దేశవ్యాప్తంగా సత్తా చాటి హస్తినలో పాగా వేయడంతో బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీని దీటుగా ఎదుర్కొనేందుకు లాలూ, నితీష్‌ లతో పాటు కాంగ్రెస్‌ పార్టీలు ఒక్కటయ్యాయి.

లడ్డూలకు ఆర్డర్‌ ఇచ్చి.. ఆపై కనిపించలేదు!

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించనిరీతిలో దారుణ పరాభవాన్ని మూటగట్టుకోవడంతో ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం బోసిపోయింది. ఎప్పుడూ నేతలు, కార్యకర్తలతో సందడిగా ఉండే ఇక్కడ పెద్దగా జనసంచారమే లేక నిర్మానుష్యంగా మారింది. ఆదివారం పార్టీ సీనియర్‌ నేతలెవరూ కార్యాలయం వైపు రాలేదు. ఒకరిద్దరు పార్టీ అధికార ప్రతినిధులు, స్థానిక నేతలు మాత్రమే కార్యాలయంలో ఉండి.. తమను పలుకరించిన విలేకరులతో మాట్లాడారు. పార్టీ ఓటమి పట్ల అగ్రనేతల తప్పేవిూ లేదని సమర్థిస్తూ మాట్లాడారు.

‘రవిశంకర్‌ ప్రసాద్‌తో సహా పలువురు సీనియర్‌ నాయకులు ఉదయం పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఎన్నికల ఫలితాల ట్రెండ్స్‌ పార్టీకి వ్యతిరేకంగా మారుతుండటంతో వారు ఒక్కొక్కరే కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. పార్టీ విజయం పట్ల ధీమాతో నేతలు లడ్డూలు, మిఠాయిలను మొదట ఆర్డర్‌ చేశారు. అయితే ఫలితాల ట్రెండ్స్‌ ఒక్కసారిగా మారిపోవడంతో అన్ని ఆర్డర్లు రద్దు చేశారు’ అని కార్యాలయం వద్ద ఉన్న బీజేపీ కార్యకర్త ప్రవీణ్‌సింగ్‌ తెలిపారు.

నిజానికి బిహార్‌ ఎన్నికల్లో విజయం సాధిస్తామని విశ్వాసంతో ఉన్న బీజేపీ నేతలు అశోకా రోడ్డు 11లోని పార్టీ కార్యాలయంలో భారీ ఏర్పాట్లే చేశారు. ఫలితాలను వీక్షించేందుకు డజన్ల కొద్ది పెద్ద స్క్రీన్లు, మధ్యాహ్నం భోజనం ఏర్పాటుచేశారు. ఫలితాలు పార్టీకి వ్యతిరేకంగా రావడంతో ఈ ఏర్పాట్లన్నీ వృథా అయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *