పాట్నా : బీహార్‌లోని నలంద సమీపంలో కాపలా లేని రైల్వే క్రాసింగ్ వద్ద రైలు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ప్యాసింజర్ రైలు క్రాసింగ్‌ను దాటుతున్న వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రమాదానికి గురైన రైలు రాజ్ గిరి – ధన్ పూర్ ప్యాసింజర్.




