బెట్టింగ్‌ గుట్టురట్టు

– అదుపులోకి తీసుకున్న పోలీసులు
కడప, మే28( జ‌నం సాక్షి ) : ఐపీఎల్‌ పైనల్‌లో భాగంగా ‘చెన్నై సూపర్‌ కింగ్స్‌ – సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌’ మధ్య ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌పై బెట్టింగ్‌లు నిర్వహించిన ముఠాను కడప పోలీసులు అరెస్టు చేశారు. రవివర్మ, అశోక్‌ వర్మ అనే ఇద్దరు అంతర్రాష్ట్ర క్రికెట్‌ బుకీలు నగరంలోని అక్కాయపల్లెలో బెట్టింగ్‌ నిర్వహిస్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. నిందితుల నుంచి 35 లక్షల రూపాయల నగదు, 26 ఫోన్లు, ఓ వాహనం, 4 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు కడప జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాసులరెడ్డి తెలిపారు. ఇప్పటికే ఈ బుకీలు విజయవాడ, గుంటూరు, హైదరాబాద్‌, బెంగళూరు, విశాఖ ప్రాంతాల్లో సహాయకులను పెట్టుకుని బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్లు అదనపు ఎస్పీ పేర్కొన్నారు. ఈ ఇద్దరు బుకీలు ఇప్పటివరకు సుమారు రూ.15 కోట్ల వరకు బెట్టింగ్‌ నిర్వహించినట్లు విచారణలో వెల్లడైందని వెల్లడించారు.