Tuesday, 3 November 2026

బెర్లిన్‌ గోడలో మరికొంత భాగం కూల్చివేత

బెర్లిన్‌ : చారిత్రక బెర్లిన్‌ గోడలో మరికొంత భాగాన్ని కూల్చేశారు. ఓ లగ్జరీ అపార్టు మెంటు నిర్మాణం కోసం గోడలో సుమారు ఒకటిన్నర కిలోమీటరు పొడవునా గోడను తొలగించారు. అర్థరాత్రి సమయంలో కూల్చివేత కార్యక్రమం మొదలుపోట్టి తెల్లవారేసరికి పూర్తిచేశారు.
అపార్ట్‌మెంట్‌ నిర్మాణానికి గోడలో కొంతభాగాన్ని కూల్చేయాలన్న ప్రతిపాదనపై బెర్లిన్‌వాసులు నిరసనలకు దిగడంతో అందుకు అర్థరాత్రి సమయాన్ని ఎంచుకున్నారు. గోడను కూల్చేసిన వెంటనే అపార్ట్‌మెంట్‌ నిర్మాణ పనులు కూడా మొదలయ్యాయి. సమారు 250 మంది పోలీసులు గోడ కూల్చివేత కార్యక్రమానికి రక్షణగా ఉన్నారు.
చట్ట ప్రకారం అపార్ట్‌మెంట్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి సహకరించడంతో పాటు శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వచ్చే వారిని ఆహ్వానించడానికే గోడ దగ్గర మొహరించినట్లు బెర్లిన్‌ పోలీబాస్‌ చిత్రమైన సమాధానమిచ్చారు. విమర్శకులు మాత్రం లాభార్జన కోసం చారిత్ర సంబదను త్యాగం చేస్తోందంటూ ప్రభత్వంపై మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *