మక్కపేట : కాంగ్రెస్ అవినీతి ప్రభుత్వానికి చంద్రబాబు అమ్ముడుపోయారని షర్మిల ఆరోపించారు. వీరికి ప్రజలే సరైన బుద్ది చెబుతారని అన్నారు. మరోప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా కృష్ణా జిల్లా మక్కపేటలో జరిగిన బహిరంగసభలో షర్మిల ప్రసంగించారు.జగనన్న సీఎం అయ్యాక వైఎస్సార్ ఆశయాలను నిజం చేస్తారని హామినిచ్చారు. బెల్ట్ షాపులను తొలగిస్తామన్నారు. స్కూల్ విద్యార్థికి 500 రూపాయలు, ఇంటర్ విద్యార్థికి 700 ,డిగ్రీ విద్యార్థి 1000 అకౌంట్‌లో వేస్తారని చెప్పారు.




