బైక్ నడిపే ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి

 వరంగల్ ఏసీపీ గిరి కుమార్
వరంగల్ ఈస్ట్, జూన్ 28(జనం సాక్షి):
బైకులు నడిపే ప్రతి ఒక్కరు విధిగా హెల్మెట్ ధరించాలని వరంగల్ ఏసిపి గిరి కుమార్ కలకోట అన్నారు .మంగళవారం వరంగల్ నగరంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్ వద్ద హెల్మెట్ కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు .ఈ సందర్భంగా  ఏ సి పి మాట్లాడుతూ ప్రమాదాల నుండి కాపాడుకోవాలంటే హెల్మెట్ ధరించాలని అన్నారు .ట్రాఫిక్ నియమనిబంధనలు తో ప్రయాణం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.