బొత్స సంఘీభావ యాత్ర
విజయనగరం,మే14(జనం సాక్షి): విజయనగరంలో వైసిపి పాదయాత్రను వైసీపీ రాష్ట్ర నాయకులు బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ ప్రజా సంకల్పయాత్ర 2 వేలు కిలోవిూటర్లు చేరిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సంఘీభావ యాత్రలు జరుగుతున్నాయన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హావిూలు అమలు చేయడంలో వైఫల్యం చెందిందన్నారు. జగన్ పాదయాత్రలో అనేక ప్రాంతాలనుండి వస్తున్న స్పందన ఓర్వలేక విమర్శలు చేస్తున్నారన్నారు. ఈ పాదయాత్రలో వేలాదిగా వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొనట్లు ఆయన తెలిపారు. నాలుగేళ్లలో అన్ని రంగాల్లో తెలుగుదేశం ప్రభుత్వం వైఫల్యం చెందిందనిబొత్స సత్యనారయణ విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. రైతులు, ఉద్యోగులు సహా అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. దోపిడీలు, చోరీలు, అత్యాచారాలు పెరిగిపోయాయని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపై పోరాటం చేసేందేకు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాదయాత్రకు పూనుకున్నారు. ఆయన చేస్తున్న యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారని పేర్కొన్నారు.