ఉపాధ్యాయుల ధర్నా
విజయనగరం,మే14(జనం సాక్షి): ఉపాద్యాయులు పీఎఫ్ బకాయిలు 15 కోట్లు ఇవ్వాలని, సిఎఎఫ్‌ఎస్ ను రద్దు చేయాలని కోరుతూ విజయనగరం కాలెక్టరేట్ వద్ద యూటిఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి శేషగిరి, అల్లూరి శివవర్మ ఉపాధ్యాయులు పాల్గన్నారు, అనంతరం గ్రీవెన్సులో జేసీకి వినతిపత్రం అందజేశారు.