– సీహెచ్ఓ చంద్ర ప్రకాష్
కుల్కచర్ల, నవంబర్ 9 (జనం సాక్షి):
దోమల వల్ల బోదకాలు (ఫైలేరియా)వ్యాధి సంక్రమిస్తుందని, వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సీహెచ్ఓ చంద్ర ప్రకాష్, హోమియో వైద్యురాలు మహేశ్వరి సూచించారు. బుధవారం కుల్కచర్ల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బోదకాలు గురించి అవగాహన శిభిరం ఏర్పాటు చేశారు. అనంతరం బోదక వ్యాధి సోకిన 12 మందికి మోర్బిలిటీ మేనేజ్మెంట్ కిట్స్ ను బాధితులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీహెచ్ఓ మాట్లాడుతూ..బోదకాలు వ్యాధి క్యులెక్స్ అనే ఆడ దోమ కుట్టడం ద్వారా వస్తుందని,ఈ దోమ మురికి నీటిలో నివాసం ఉంటుంది కాబట్టి పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత కూడా పాటించాలని కోరారు.దోమలు వ్యాప్తి చెందకుండా మందులు పిచికారి చేయాలన్నారు.భోదకాలు ఉన్న వ్యాధి గ్రస్తులకు మన తెలంగాణ ప్రభుత్వం 2016 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు యాదమ్మ, విజయలక్ష్మి, హెల్త్ అసిస్టెంట్ వెంకటయ్య, సబ్ యూనిట్ ఆఫీసర్ వెంకన్న, ఆశ కార్యకర్త పుష్ప తదితరులు పాల్గొన్నారు.




