Wednesday, 4 November 2026

బోరుబావిలో పడ్డ చిన్నారి.. రక్షించిన గ్రామస్థులు

వేంపల్లె ం హోలీ పండగ వేళ ఓ చిన్నారి ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరు బావిలో పడింది. వెంటనే గ్రామస్థులు అప్రమత్తమై చిన్నారిని సురక్షితంగా రక్షించారు. వివరాలు ఇలా ఉన్నాయి. కడప జిల్లా వేంపల్లే మండలం కుమరాంపల్లికి చెందిన సుబ్బమ్మ, హనుమంతు దంపతులకు అమూల్య ఒక్కతే సంతానం. తల్లిరండ్రులు ఇద్దరు పొలం పనులకు వెళ్లడంతో తోటి చిన్నారులతో కలిసి బాలిక ఇంటికి సమీపంఓల హోలీ రంగులు చల్లుకుంటూ ప్రమాదవశాత్తు వ్యవసాయ బోరుబావిలో పడింది. దీంతో తోటి చిన్నారులు ప్రమాదం గురించి పెద్దలకు సమాచారమందించారు. వెంటే గ్రామస్థులు బోరుబావి వద్దకు చేరుకున్నారు. 60 అడుగుల లోతు ఉన్న బోరుబావిలో 30 అడుగుల లోతులో చిన్నారి చిక్కుకున్నట్లు గుర్తించారు. తాడును బోరులోకి బదిలారు. సురక్షితంగా బయటకు తీశారు. చిన్నారి బోరుబావిలో పడిన వెంటనే అప్రమత్తమై గ్రామస్థులు రక్షంచడంతో పెద్దప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *