Wednesday, 4 November 2026

ఇరువర్గాల మధ్య ఘర్షణ, కత్తిపోట్లు

అమలాపురం : తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మున్సిపల్‌ కాలనీలో బుధవారం రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు కత్తిపోట్లకు గురయ్యారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు పాతకక్షల కారణంగానే ఈ ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *