కడప : బ్రహ్మణి ఉక్కు కర్మాగారం ఎదుట ఆందోళనలు కొనసాగుతున్నాయి. బ్రహ్మణిని రద్దు చేసి సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని పది రోజులుగా సీపీఐ వివిధ ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. ఈరోజు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ కార్యకర్తలతో కలిసి ఉక్కు కర్మాగారాన్ని పరిశీలించారు. సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు బ్రహ్మణి ఎదుట ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఆరు నెలల వేతనాలు చెల్లించాలని నిరసన చేపట్టారు.




