హైదరాబాద్,జూన్27(జనం సాక్షి): బ్రాహ్మణపరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన మాజీ ప్రధానామంత్రి తెలంగాణ ముద్దు బిడ్డ బ్రాహ్మణ బంధువు దివంగత పివి నర్సింహారావు జయంతి కార్యక్రమాన్ని ప్రతీ జిల్లాలో విజయవంతంగా నిర్వహించాలని నిర్ణయించారు. బ్రాహ్మణ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు గంగు భానుమూర్తి అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి పోచంపల్లి రమణా రావు నిర్వహించిన రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రతీ జిల్లాలోని రాష్ట్ర నాయకులు, కార్యవర్గ సభ్యులు, జిల్లా నాయుకులు, జిల్లా అధ్యక్ష-కార్యదర్శులు యువజన విభాగం నాయకులు కమిటీ సభ్యులు నర్సింహా రావు జయంతి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమం ద్వారా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను నర్సింహా రావుకు భారతరత్న బిరుదునుప్రకటించాలని డిమాండ్ చేస్తామని అన్నారు. రాష్ట్రంలో ఒక జిల్లాకు పివి నర్సింహా రావు పేరు పెట్టాలని, హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై విగ్రహం పెట్టాలని, ఆయన పేరు విూద దేశ రాజధాని డిల్లీ నందు స్మారకస్థూపం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసారు.




