Wednesday, 4 November 2026

బ్రిటన్‌ రాజ కుటుంబంలోకి వారసుడు వేవిళ్లతో ఆస్పత్రిలో చేరిన కేట్‌


లండన్‌ : బ్రిటన్‌ రాజ కుటుంబానికి త్వరలో వారసుడు రాబోతున్నాడు. ఈ విషయాన్ని రాజ కుటుంబం ప్రతినిధి స్వయంగా విలేకరులకు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఇంగ్లడ్‌ యువరాణి కేట్‌ ప్రస్తుతం 12 వారాలు (మూడు నెలల) గర్భవతి అని తెలిపారు. ఆమె వేవిల్లతో లండన్‌ ఆస్పత్రిలో చేరారని తెలిపారు. మరికొన్ని రోజులు ఆస్పత్రిలోనే ఉంటారని తెలిపారు. ప్రిన్స్‌ చార్లెస్‌, డయానా దంపతుల కుమారుడు ప్రిన్స్‌ విలియమ్స్‌, కేట్‌ల రాజ వివాహం 2011 ఏప్రిల్‌ 29న జరిగింది. అప్పటి నుంచి రాజకుటుంబం చిన్నారి రాకకోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. యేడాదిన్నర తర్వాత ఆమె గర్భవతి కావడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇంతకాలం వారికి పిల్లలు ఎప్పుడు కలుగుతారా అని ప్రపంచ మీడియా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ విషయమై అనేక కథనాలు కూడా ప్రసారమయ్యాయి. ఎట్టకేలకు ఆమె గర్భం దాల్చారనే వార్తకు అంతే ప్రాధాన్యం ఇచ్చి ప్రసారం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *