బ్రిడ్జ్ నిర్మాణంతో రాజులతాండ కష్టాలు తిరనున్నావి-ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు. జనంసాక్షి న్యూస్ నేరడిగొండ

వర్ష కాలంలో ప్రజల వాగుదాటే కష్టాలు తీర్చుకొనేందుకు బ్రిడ్జి నిర్మాణ పనులు ముమ్మరంగా పూర్తి చేయాలని సంబందిత అధికారులకు కాంట్రాక్టను బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు సూచించారు.గురువారం రోజున మండలంలోని రాజుల తండా గ్రామ సమీపంలోని వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి భూమిపూజ  చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వల్లనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు అన్నారు.ఇట్టి కార్యక్రమంలో ఆయన తోపాటు మండల జడ్పీటీసీ అనిల్ జాదవ్ ఎంపీపీ రాథోడ్ సజన్ బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ దావుల భోజన్న ఎంపీడీఓ అబ్దుల్ సమద్ తహశీల్దార్ పవన్ చంద్ర పీఆర్డీఈ శైలేందర్ ఎంపీటీసీ మహేందర్ స్థానిక సర్పంచ్ గంగామణి ఆయా జీపీ సర్పంచ్లు పెంట వెంకటరమణ రాబడే జగదీష్ జనార్దన్ మండల పార్టీ కన్వీనర్ శివారెడ్డి జిల్లా లైవ్ అధ్యక్షుడు మహేందర్ జాధవ్ కుమారి గ్రామ పీఏసీఎస్ ఛైర్మన్ మందుల రమేశ్ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.