Tuesday, 3 November 2026

బ్లాక్‌ బాక్స్‌ దొరికింది

4

జకర్తా జనవరి11(జనంసాక్షి): ఎయిర్‌ ఏషియా విమాన ప్రమాద శకలాల అన్వేషణలో అధికారులు కీలక పురోగతి సాధించారు. విమాన బ్లాక్‌ బాక్స్‌ను ఇండోనేసియా అధికారులు ఆదివారం జావా సముద్రంలో కనుగొన్నారు. బుధవారం విమాన తోక శకలాన్ని గుర్తించిన అన్వేషణ బృందం.. బ్లాక్‌ బ్లాక్‌ కూడా అదే ప్రాంతంలో ఉంటుందని

గాలింపు చర్యలు చేపట్టారు. రెండు వారాల క్రితం ఇండోనేసియా నుంచి సింగపూర్‌ వెళ్తున్న ఎయిర్‌ ఏషియా విమానం జావా సముద్రంలో కూలిపోయిన సంగతి తెలిసిందే. విమానంలో ఉన్న 162 మంది మరణించారు. ఇప్పటివరకు 40 మృతదేహాలను మాత్రమే వెలికితీశారు. శకలాల మథ్య బ్లాక్‌ బాక్స్‌ ఇరుక్కుపోవడంతో బయటకు తీయడం కష్టమవుతుందనీ సోమవారం ఉదయం నుంచి బయటకు తీయడానికి ప్రయత్నిస్తామనీ ఇండోనేషియా అధికారులు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *