భగత్ అంటే నాకు ప్రాణం, ఆయనుంటేనే ఏ వేడుకైన నందికొండ టిఆర్ఎస్ పట్టణ కార్యదర్శి… భూష రాజుల కృష్ణయ్య.

నాగార్జునసాగర్ (నందికొండ)జూన్10 (జనం సాక్షి); నాగార్జునసాగర్ నియోజకవర్గం శాసనసభ్యులు నోముల భగత్ నివాసంలో నందికొండ మున్సిపాలిటీ పట్టణ కార్యదర్శి భూష రాజుల కృష్ణయ్య జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.పుట్టినరోజు వేడుకలు చేసుకుంటే ఎమ్మెల్యే భగత్ తోనే చేసుకుంటానని నందికొండ మున్సిపాలిటీ పట్టణ ప్రధాన కార్యదర్శి భూష రాజుల కృష్ణయ్య అన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే భగత్ నా ఊపిరి,నా ప్రాణమని ఆయన అన్నారు. అలాగే పెద్దవూర జెడ్పిటిసి అభ్యర్థి కృష్ణారెడ్డి కూడా తనకు రెండు కళ్లు అని తెలిపారు. తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం కోసం ఎమ్మెల్యే రాక కోసం ఎదురుచూస్తున్నాను అని ఆయన తెలిపారు. ఆయన వస్తేనే పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని నిర్ణయించుకున్నాని అన్నారు.తన కోసం ఎమ్మెల్యే విలువైన సమయాన్ని కేటాయించి పుట్టినరోజు వేడుకలకు విచ్చేసి సమయం కేటాయించిన అందులకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. అనంతరం ఎమ్మెల్యే కేక్ కట్ చేయించి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఎమ్మెల్యే భగత్ మాట్లాడుతూ భూష రాజుల కృష్ణయ్య కి తన మనస్సులో ప్రత్యేక స్థానం ఉన్నదని తెలిపారు. సోషల్ మీడియాలో చురుగ్గా పని చేస్తున్నాడన్నారు.అన్ని విధాలుగా ఆయన కి తోడుగా ఉంటానని తెలిపారు.అనంతరం నాయకులు, కార్యకర్తలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.