Wednesday, 4 November 2026

భర్త అనుమానించాడని 

బిడ్డను నేలకేసి కొట్టిన భార్య
హైదరాబాద్‌, ఆగస్టు28(జ‌నం సాక్షి) : భర్తతో గొడపడి తన నెలలు చిన్నారిని నడిరోడ్డుపై నేలవిూద పడేసింది ఓ కర్కశపు తల్లి. అమ్మానాన్నల బంధాన్ని ప్రశ్నించే ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి మెహదీపట్నంలో చోటుచేసుకుంది. ప్లైఓవర్‌ సవిూపంలోని బస్టాండ్‌ వద్ద జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అక్రమ సంబంధం పేరిట భర్త అనుమానించడమే దంపతుల మధ్య వాగ్వాదానికి కారణంగా మారింది. బిడ్డ తనకు పుట్టలేదని భర్త అనుమానిస్తున్నాడని అతడితో నడిరోడ్డుపైనే సదరు భార్య గొడవకు దిగింది. భర్తపై కోపంతో చేతిలోని చిన్నారిని రోడ్డుపై పడేసింది. తనవిూదున్న కోపాన్ని బిడ్డపై చూపడమేంటని భర్త ఆమె చెంపచెళ్లుమనిపించాడు. ఇప్పటిదాకా మామూలుగా మాట్లాడుకున్న భార్యాభర్తలు ఒక్కసారిగా గోడవపడ్డారు. ఆ గొడవ చిలికి చిలికి గాలివానాలా మారి ఈ బిడ్డ తనకు పుట్టలేదని అంటూ భర్త అక్కడ నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో మహిళ తన చేతిలో ఉన్న బిడ్డను భర్తవిూదకు విసిరేయడానికి ప్రయత్నించింది. అయినా అతడు పట్టించుకోకపోవడంతో నేలవిూద పడేసింది. ఇదంతా అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ పోలీసుల కంటబడింది. భార్యాభర్తలకు పోలీసులు కౌన్సిలింగ్‌ నిర్వహించి చిన్నారిని వారికి అప్పగించి అక్కడ నుంచి పంపించారు. ఈ ఘటన రాత్రి 10 గంటల ప్రాంతంలో జరిగింది. గొడవ కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ తతంగాన్ని చూసిన ఓ వ్యక్తి తన మొబైల్‌లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో ఉంచడంతో వెలుగులోకి వచ్చింది. అయితే, తమకు గత డిసెంబరులో వివాహం కాగా, భార్య తల్లి వల్లే గొడవలు జరుగుతున్నాయిని సదరు భర్త పేర్కోవడం గమనార్హం. దీనికి భిన్నంగా భార్య స్పందించింది. తనకు ఈ బిడ్డ పుట్టలేదని అంటున్నారని ఆమె తెలిపింది.