భవిష్యత్‌ వ్యవసాయాధారిత పరిశ్రమలదే


నిరంతర విద్యుత్‌తో పెరిగిన ఉపాధి అవకాశాలు
స్వర్ణబారతిలో అగ్రోరైతు సేవా కర్యక్రమం ప్రారంభం
తెలంగాణలో వ్యవసాయ ముఖచిత్రం మారిందన్న నిరంజన్‌ రెడ్డి
హైదరాబాద్‌,ఆగస్ట్‌11(జనం సాక్షి): భవిష్యత్‌ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలదేనని, ఏ రంగంలో ఇంత పెద్ద ఎత్తున ఉపాధి లేదని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఇందుకోసం అవకాశాలు తన్నుకుని వస్తున్నాయని అన్నారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ రాష్ట్రంలోని ఆగ్రో రైతుసేవా కేంద్రాల నిర్వహకులకు అగ్రి క్లినిక్‌, అగ్రి బిజినెస్‌లో మేనేజ్‌ సంస్థ సహకారంతో ఆగ్రోస్‌ నిర్వహిస్తున్న 45 రోజుల ప్రత్యేక శిక్షణ తొలి విడత శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఆగ్రోస్‌ ఎండీ రాములు, మేనేజ్‌ ప్రిన్సిపల్‌ కోఆర్డినేటర్‌ ఎస్‌ఎస్‌ పండ్‌, మేనేజ్‌ డీజీ చంద్రశేఖరతో కలిసి మంత్రి దీనిని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత పారిశ్రావిూకరణ పెరిగిందని, 15లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించిందన్నారు. కరెంటు సౌకర్యం లేక సమైక్యపాలనలో పరిశ్రమలు మూతపడ్డాయని, ఆరు లక్షల మంది ఉపాధి కోల్పోయారన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ దుస్థితి నుంచి బయటపడ్డామన్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక దేశంలో అత్యధిక పరిశ్రమలు వచ్చాయని, వాటితో గ్రావిూణ వ్యవస్థ ముఖ చిత్రం మారిపోయిందన్నారు. పాశ్చాత్య దేశాల్లో గ్రావిూణ, పట్టణ వ్యవస్థకు తేడా ఉండదని, గ్రామాల్లో అయినా.. పట్టణాల్లో అయినా మౌలిక వసతులు, ఉపాధి అవకాశాలు ఉండాలని అన్నారు. గ్రామాలు దేశానికి పట్టుగొమ్మలని, ప్రజల కొనుగోలు శక్తి పెరగాలంటే వారికి ఉపాధి కల్పించా లన్నారు. రాష్ట్రంలో గత ఏడేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుచూపుతో వివిధరంగాలలో వినూత్న మార్పులు తీసుకువచ్చారని చెప్పారు. ఆగ్రో రైతు సేవా కేంద్రాల ద్వారా నిర్వాహకులు వైవిధ్యంగా, సృజనాత్మకతతో కేంద్రాన్ని నిర్వహించాలని సూచించారు. ఆధునిక ప్రపంచంలో మనం ఎదిగేందుకు ఎన్నో అవకాశాలున్నాయని, లక్ష్యం నిర్దేశిరచుకున్న తర్వాత మానసిక ధైర్యంతో ముందుకుసాగాలని పిలుపునిచ్చారు.