హైదరాబాద్, : భాగ్యనగరంలో బతుకమ్మ ఆటల సందడి ముందుగానే ప్రారంభమైంది. పాశ్చత్య సంస్కృతికి నిలయంగా ఉంటే ఐటీ హబ్ హైటెక్ సిటీలో ఈ పూల పండుగకు ఘనంగా స్వాగతం పలికారు. బతుకు నిచ్చేది బతుకమ్మ పండుగ ఒక్క తెలంగాణలో తప్ప ప్రపంచంలో మరెక్కడా లేని అరుదైన సంప్రదాయం ఇది. ఆడపడుచులంతా పూల దేవతను పేర్చి ఆటపాటలతో అంగరంగ వైభవంగా జరుపుకునే ముచ్చటైన వేడుక ఇది. తంగేడు, గులుగు, బంతి, చేమంతి ఇలా తిరక్క పువ్వులతో రూపు దిద్దుకున్న బతుకమ్మను ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటారు. తెలంగాణ వ్యాప్తంగా సోమవారం నుంచి బతుకమ్మ ప్రారంభం కానుండగా.. హైదరాబాద్ నగరంలో బతుకమ్మ సండడి ముందుగానే మొదలైంది
భాగ్యనగరంలో మొదలైన బతుకమ్మ సందడి




