భాజాపానే వైకాపా గెలుస్తుందనడం విడ్డూరం
– విష్ణుకుమార్ వ్యాఖ్యలతో ప్రజల అనుమానాలు బలపడుతున్నాయి
– కర్ణాటకలో గాలి సోదరులకు టికెట్లిచ్చినట్లు ఏపీలో వైకాపా, భాజపా కలిశాయా?
– రహస్య ఒప్పందాలు బయటపెట్టాలి
– మే8న భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తాం
– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
విజయవాడ, మే5(జనం సాక్షి ) : భారతీయ జనతా పార్టీ ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తుందో ఆ పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు చూస్తుంటే అర్ధమవుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. విజయవాడలో ఆయన విూడియాతో మాట్లాడుతూ.. ఎవరైనా తమ పార్టీ గెలుస్తుందని అని చెప్పుకుంటే పర్వాలేదు గానీ.. విష్ణుకుమార్ రాజు మాత్రం ప్రతిపక్ష పార్టీ వైకాపా అధికారంలోకి వస్తుందని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కర్ణాటకలో గాలి సోదరులకు పార్టీ టిక్కెట్లు ఇచ్చినట్టు ఇక్కడ కూడా వైకాపా.. భాజపా కలిసిపోయాయా? అని ప్రశ్నించారు. భాజపా, వైకాపా నాయకులు దీని వెనకున్న రహస్య ఒప్పందాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు, ¬దా కోసం ఏ రోజూ మోదీని పల్లెత్తు మాట అనని జగన్.. చంద్రబాబు విూద మాత్రం విరుచుకుపడుతూ ప్రజలకు ఎలాంటి సంకేతాలిస్తున్నారని రామకృష్ణ ప్రశ్నించారు. వైకాపా గురించి ఆ పార్టీ నాయకుల కంటే ఎక్కువగా భాజపా నాయకులే పొగడ్తలు కురిపిస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. అవినీతిపరుల గుండెల్లో నిద్రిస్తా అని చెప్పిన ప్రధాని మోదీ.. మైనింగ్ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డి వర్గానికి కర్ణాటక ఎన్నికల్లో టిక్కెట్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. అవినీతిని సహించనని ప్రగల్భాలు పలుకుతున్న మోదీ అవినీతి పరులకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. ప్రజలు రాబోయే ఎన్నికల్లో భాజపాకు తప్పకుండా బుద్ధి చెబుతారన్నారు. మే 8వ తేదీన విభజన హావిూల సాధన సమితి సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని రామకృష్ణ స్పష్టం చేశారు.