నాంపల్లి కోర్టు తీర్పు
హైదరాబాద్,మే9(జనం సాక్షి): మ్దదెల చెరువు సూరి హత్యకేసులో ప్రధాన నిందితుడైన భానుకిరణ్‌కు అక్రమ ఆయుధాల వినియోగం కేసులో నాంపల్లి కోర్టు ఏడాది జైలు శిక్ష, రూ. 10వేలు జరిమానా విధించింది. భాను కిరణ్‌తోపాటు మరో ఇద్దరికి జైలు శిక్ష విధించింది. 2009లో అక్రమ ఆయుధాల కేసులో భానుకిరణ్‌ను టాస్క్‌ఫోర్స్ అరెస్ట్ చేసింది. ఈ కేసుకు సంబంధించి బుధవారం కోర్టు విచారణ జరిపి తీర్పు వెలువరించింది. మ్దదెల చెరువు సూరి హత్యకేసుకు సంబంధించి విచారణ కొనసాగుతోంది. కాగా మ్దదెల చెరువు సూరి హత్య కేసులో భానుకిరణ్ అయిదేళ్లుగా జైలులోనే ఉన్నాడు.మ్దదెల చెరువు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ మ్దదెల చెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్‌కు కోర్టు ఏడాది జైలు శిక్ష, 10 వేల రూపాయల జరిమానా విధించింది. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడన్న కేసులో నిందితుడు భాను కిరణ్‌తో పాటు మరో ఇద్దరికి శిక్ష విధించింది. అక్రమ ఆయుధాలు, హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న భానును కొన్నేళ్ల కిందట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సూరి హత్య కేసులో అరెస్టయిన భానుకిరణ్ ప్రస్తుతం జైల్లోనే ఉన్న విషయం తెలిసిందే.
భానుకు ఏడాది జైలు




