Tuesday, 3 November 2026

భారత్‌కు రానున్న శ్రీలంక విదేశీ వ్యవహారాల మంత్రి

p9rfkyrlన్యూఢిల్లీ: శ్రీలంక విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మంగళసమరవీర భారత్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన ఈనెల 18న భారత్‌కు రానున్నారు. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ఆహ్వానం మేరకు సమరవీర భారత్‌ను సందర్శించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సుష్మాస్వరాజ్‌తో ఆయన ఇరుదేశాల సంబంధాలపై చర్చించనున్నారు.

సుష్మాస్వరాజ్ ఇటీవలే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా నియామకమైన సమరవీరకు శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా భారత్‌ను సందర్శించాల్సిందిగా ఆయనను కోరారు. ప్రధాని నరేంద్రమోడీ శ్రీలంక నూతన అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేను భారత్‌కు రావాల్సిందిగా ఆహ్వానాన్ని పంపిన విషయం తెలిసిందే. ఈ ఆహ్వానంపై ఆ దేశ అధికారప్రతినిధి మాట్లాడుతూ శ్రీలంక అధ్యక్షుని మొదటి పర్యటన భారత్‌లోనే కొనసాగుతుందని స్పష్టం చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *