Tuesday, 3 November 2026

భారత్‌లో ఒబామా పర్యటనకు షెడ్యూల్‌ ఖరార్‌

3

న్యూఢిల్లీ,జనవరి14(జనంసాక్షి): అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా భారత్‌ పర్యటన షెడ్యూల్‌ ఖరారయ్యింది.  భారత గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు ఒబామా వస్తున్నారు. ఈ నెల 25 నుంచి 27 వరకు భారత్‌లో  పర్యటించనున్నారు.  ఢిల్లీలో జరిగే సీఈఓల సమావేశంలో ఓబామా పాల్గొంటారు. ఆయన ఆగ్రాలోని తాత్‌మహల్‌ను  కూడా సందర్శిస్తారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య రక్షణ రంగ ఒప్పందాలు, పౌర అణు ఇంధన ఒప్పందంపై పురోగతి సాధించేందుకు కృషి జరుగుతుందని అమెరికా విదేశాంగ మంత్రి జాన్‌కెర్రీ చెప్పారు. అధ్యక్షుని భద్రత కోసం ఢిల్లీ  పోలీసులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.  భద్రతా విధుల్లో అమెరికా ఏజెన్సీలు, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూపు, సైన్యం, పారామిలిటరీ బలగాలతోపాటు ఇరుగుపొరుగు రాష్టాల్రకు చెందిన పోలీసు బలగాలు కూడా పాలుపంచుకుంటున్నట్లు పోలీస్‌ కమిషనర్‌ బీఎస్‌ బస్సీ తెలిపారు. ఉగ్రవాదులు ఏక్షణంలోనైనా దాడికి పాల్పడే అవకాశముందనే గూఢచార విభాగం హెచ్చరికల నేపథ్యంలో  పోలీసు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్సు టెర్మినళ్లు, మెట్రో రైల్వేస్టేషన్లు, మాల్స్‌ వంటి కీలక ప్రదేశాలలో ప్రత్యేక బృందాలు మోహరిస్తాయి. అమెరికా అధ్యక్షుడి ¬దాలో రెండో పర్యాయం భారత పర్యటనకు వస్తున్న తొలి అధ్యక్షుడు ఒబామాయే కావటం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *