హైదరాబాద్,జనవరి14(జనంసాక్షి): ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పరిపాలన భేష్‌గా ఉందనీ కాంగ్రెస్ సీనియర్ నేత ఎం.సత్యనారాయణరావు ప్రశంసించారు. ఆయన పాలన బాగుందని, మంచి వాగ్దానాలు ఇస్తున్నారని అన్నారు. కేసీఆర్ ఇస్తోన్న వాగ్దానాలు బాగున్నాయని కితాబిచ్చారు. ఆయన హావిూలు అమలైతే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. వాగ్దానాలను నెరవేర్చే శక్తిని ఆ భగవంతుడు కేసీఆర్‌కు ప్రసాదించాలని ఆకాంక్షించారు. తనకు గవర్నర్ కావాలని కోరిక ఉన్నా అది నెరవేరలేదని, అదృష్టం లేక గవర్నర్ పదవి వరించలేదని ఎంఎస్‌ఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో ఎమ్మెస్సార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పార్టీకి చెందిన సీనియర్ నేతలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెస్సార్ మాట్లాడుతూ….తనకు గవర్నర్ పదవి ఇప్పించేందుకు రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్రెడ్డి ఎంతగానో ప్రయత్నించారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ వల్లే సాధ్యమైందని ఆయన చెప్పారు. లేకుంటే బ్రహ్మదేవుడు దిగి వచ్చిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాకారమయ్యేది కాదని తెలిపారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఎన్నికలకు ముందు సరిగ్గా వ్యవహరించలేదని పేర్కొన్నారు. అసలు సోనియాగాంధీ లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదని తెలిపారు. సోనియాగాంధీ నాయకత్వాన్ని మార్చాల్సిన అవసరంలేదన్నారు. రాష్ట్రంలో పార్టీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ఎంఎస్‌ఆర్ చెప్పారు.కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన… ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో విజయం సాధించలేకపోయామన్నారు. అలాగే కార్యకర్తలను సమన్వయం చేయడంలో కూడా పార్టీ విఫలమైందని ఎమ్మెస్సార్ వెల్లడించారు. దేశంలో, రాష్టాల్రలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దెబ్బతిందని ఎమ్మెస్సార్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ పటిష్టత కోసం కాంగ్రెస్ నేతలు ఐక్యంగా కృషి చేస్తే వచ్చే ఎన్నికల్లో అధికారం మనదేని ఎమ్మెస్సార్ స్పష్టం చేశారు.
కేసీఆర్ పాలన భేష్ : ఎమ్మెస్‌ఆర్





