దేశాభివృద్ధిలో భాగస్వాములుకండి
సేవలో మహాత్ముని ఆదర్శంగా తీసుకోండి
ప్రవాస భారతీయ దివస్లో ప్రధాని మోదీ
గాంధీనగర్,జనవరి8(జనంసాక్షి): దేశాభివృద్దికి మీవంతు చేయుతనివ్వండి. దేశంలో ప్రవాస భారతీయులకు అపారమైన అవకాశాలున్నాయి. అవన్నీ మీ కోసం ఎదురుచూస్తున్నాయనీ ప్రధాన నరేంద్ర మోదీ ప్రవాస భారతీయులకు పిలుపునిచ్చారు. గుజరాత్ రాజధాని గాంధీనగర్లో ఏర్పాటు చేసిన ప్రవాస భారతీయ దివస్ను మోదీ ప్రారంభించారు. ప్రపంచానికి భారత్ ఓ ఆశాకిరణంలా కనిపిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇప్పుడు అందరూ భారత్ వైపే చూస్తున్నారని.. భారతీయులు అంతా ఒక శక్తిలా పనిచేస్తే కనీవిని ఎరుగని ఫలితాలు సాధించవచ్చని అన్నారు. గాంధీనగర్లో ఏర్పాటు చేసిన ప్రవాసీ భారతీయ దివస్ను మోదీ ప్రారంభించి ప్రసంగించారు. ఇంటిల్లిపాదినీ, మిత్రులను వదిలి విదేశాలకు వెళ్తున్నారని.. ఇప్పుడు పరిస్థితులు మారాయని, దేశంలో ప్రవాస భారతీయులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. దేశంలో ఎన్నో అవకాశాలు విూకోసం ఎదురుచూస్తున్నాయని.. దేశాభివృద్ధికి విూవంతు చేయూతనివ్వండని ప్రవాసులను కోరారు. మహాత్మాగాంధీ కూడా అవకాశం కోసమే విదేశాలకు వెళ్లారని.. భరతమాత స్వేచ్ఛ కోసం తిరిగి స్వదేశానికి వచ్చారని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా 200కుపైగా దేశాల్లో భారతీయులు ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఏ దేశమేగినా మన సామర్థ్యాన్ని, సంప్రదాయాల్ని భారతీయులు కాపాడుతున్నారని మోదీ కొనియాడారు. ప్రధాని బాధ్యతలు చేపట్టాక ప్రపంచంలోని ఎంతో మందితో మాట్లాడే అవకాశం దక్కిందని అన్నారు. ధనిక, పేద దేశాల నాయకులతో చర్చించే అవకాశం తనకు దక్కిందని పేర్కొన్నారు. యోగా దినోత్సవ నిర్వహణకు 177 దేశాలు మద్దతు పలికాయని తెలిపారు. . మహాత్మాగాంధీ కూడా అవకాశం కోసమే విదేశాలకు వెళ్లారు. భరతమాత స్వేచ్ఛ కోసం మహాత్ముడు తిరిగి స్వదేశానికి వచ్చారు. మారిషస్లో అక్టోబర్ 2న గాంధీ జయంతి జరుపుకుంటారు. ఆస్టేల్రియాలో కూడా మహాత్ముడి ప్రతిమలను నెలకొల్పారు. మహాత్ముడి సిద్ధాంతాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. ప్రవాస భారతీయుల వల్లే ఎన్నో దేశాల్లో భారతీయ పండగలు జరుపుకుంటున్నారు. భారతీయ కుటుంబ విలువలను విదేశీయులూ పాటిస్తున్నారు. ప్రధాని బాధ్యతలు చేపట్టాక ప్రపంచంలోని ఎంతోమందితో మాట్లాడే అవకాశం దక్కింది. ధనిక, పేద దేశాల నాయకులతో చర్చించే అవకాశం దక్కింది. ఇప్పుడు అందరూ భారత్ వైపే చూస్తున్నారు. భారతీయులు అంతా ఒక శక్తిలాగా పనిచేస్తే కనీవినీ ఎరుగని ఫలితాలు సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు. దేశంలో ప్రవాస భారతీయులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. దేశంలో ఎన్నో అవకాశాలు విూకోసం ఎదురుచూస్తున్నాయని.. దేశాభివృద్ధికి విూవంతు చేయూతనివ్వండని ప్రవాసులను కోరారు. గాంధీనగర్లో ప్రవాసీ భారతీయ దివస్ను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్, గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ తదితరులతోపాటు వేలాది మంది ప్రవాస భారతీయులు హాజరయ్యారు. ఢిల్లీలో ప్రవాసభారతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. ప్రవాసులు భారత్లో అడుగు పెడుతూనే వీసా ఇచ్చే ఏర్పాట్లు చేశాం. పీఐవో, ఓసీఐ విలీనం చేశాం. అందరికీ సమాన లబ్ధి. ప్రవాస భారతీయ కేంద్రంలో అవసరమైన సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రవాసులకు మాతృభూమిపై ఎప్పటికీ ప్రేమ తరగదని ఆయన పేర్కొన్నారు.





