Tuesday, 3 November 2026

ఫ్రాన్స్‌లో కొనసాగుతున్న కాల్పులు

4
ప్రార్థనా మందిరంలోని కాల్పుల్లో మహిళ మృతి

ప్యారిస్‌,జనవరి8(జనంసాక్షి):  ఫ్రాన్స్‌లో మారణకాండ ఆగడం లేదు బుధవారంనాడు 12 మందిని హతమార్చిన దుర్ఘటన ఇంకా అవశేషం ఉందన్నట్టు గురువారం నాడు అనేక చోట్ల ప్రార్థనా మందిరాలపై ఉగ్రవాదులు కొనసాగిస్తున్నారు. ప్రాన్స్‌ మోంట్రోగ్‌లో గురువారం ఉదయం దుండగుడు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన మహిళా పోలీసు అధికారి మృతిచెందారు. బుల్లెట్‌ ప్రూఫ్‌ కోటు ధరించిన ఓ సాయుధ దుండగుడు పోలీసు అధికారులు లక్ష్యంగా కాల్పులు జరిపి మెట్రో రైలులో పరారయ్యాడు. దుండగుడి కాల్పుల్లో ఓ మహిళా పోలీసు అధికారి, మరో పౌరుడు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతూ మహిళా పోలీసు అధికారి మృతిచెందారు.బుధవారం ఉగ్రవాదులు పత్రికా కార్యాలయంపై దాడి చేసి 12 మందిని హతమార్చిన నేపథ్యంలో ఫ్రాన్స్‌లో నిరసన వెల్లువెత్తుతోంది. దేశంలో పలుచోట్ల ప్రార్థనామందిరాలపై దాడులు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో తాజాగా  ఫ్రాన్సును ఉగ్రవాద భూతం వణికిస్తోంది. తాజాగా లియోన్‌ ప్రాంతంలోని ఓ ప్రార్థనామందిరం  బయట శక్తిమంతమైన బాంబు పేలింది. అయితే ఇందులో ఎవరికీ గాయాలైనట్లు ఇంతవరకు సమాచారం అందలేదు. దాంతోపాటు పలు ప్రార్థనామందిరాల వద్ద కూడా దాడులు జరిగినట్లు సమాచారం అందుతోంది. రోవైపు.. బుధవారం నాటి చార్లీ హెబ్డో కార్యాలయంపై కాల్పులు జరిపిన ఘటనకు సంబంధించి నిందితులైన ఇద్దరు సోదరుల కోసం ఫ్రెంచి పోలీసులు గాలింపు జరుపుతున్నారు. గురువారం నాడు ఈ ఇద్దరి ఫొటోలను పోలీసులు విడుదల చేశారు. వీళ్లు సాయుధులని, అత్యంత ప్రమాదకరమైనవాళ్లని తెలిపారు. ఈ ఘటనలో ఏడుగురిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసినట్లు ప్రధానమంత్రి మాన్యుయెల్‌ వాల్స్‌ తెలిపారు. పాత్రికేయుల మృతికి ఫ్రాన్స్‌ ఒకరోజు సంతాపం పాటిస్తోంది.  పారిస్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడిని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్‌ బాన్‌ కీ మూన్‌ ఖండించారు. దీన్ని ప్రజాస్వామ్యానికి పునాదులైన పత్రికా స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. బుధవారం ఫ్రాన్స్‌లోని పారిస్‌లో పత్రికా కార్యాలయంపై దాడి చేసి ఎడిటర్‌తో సహా 12 మందిని ఉగ్రవాదులు కాల్చి చంపిన విషయం తెలిసిందే.ఫ్రాన్స్‌లోని పారిస్‌లో చార్టీహెబ్డో వారపత్రికపై ఉగ్రవాదులు నిన్న జరిపిన దాడిని మరవకముందే పారిస్‌లో మరో ఘటన చోటుచేసుకుంది.  ఉగ్రవాదులు సదరన్‌ ప్యాలెస్‌లోని మోంట్రోగ్‌లో మళ్లీ కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన జరిగిన కొద్ధిసేపటికే పారిస్‌ లియోన్‌లోని ఓ రెస్టారెంట్‌ వద్ద బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘాతుకానికి పాల్పడిన ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన అనంతరం మెట్రోరైలులో పారిపోయారు. పేట్రేగిన ఉగ్రవాదులు 24 గంటల్లోనే వరుసగా మూడు దాడులు జరపడంతో ఫ్రాన్స్‌ ప్రజలు భయాందోళనలకు గురవతున్నారు. పారిస్‌లో వరుస దాడుల నేపథ్యంలో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *