ఇస్లామాబాద్: భారత్, పాకిస్థాన్‌ల మధ్య జరగాల్సిన స్నూకర్ సీరిస్ వాయిదా పడింది. కరాచీలో భద్రతా కారణాల రీత్యా ఈ సిరిస్ వాయిదా వేస్తున్నామని, ఎప్పుడు జరపబోయేదీ త్వరలో చెప్పామని పాకిస్థాన్ బిలియర్డ్స్ అండ్ స్నూకర్ అసోసియేషన్ అధ్యక్షుడు అలంగిర్ షేక్ ప్రకటించారు. కరాచీలో ఆదివారం నాడు జరిగిన పేలుళ్లలో 45 మంది మరణించగా, 150 మంది దాకా గాయపడిన సంగతి తెలిసిందే.




