భారీ లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ తగ్గిన బంగారం, పెరిగిన వెండి

fr6fdubmముంబై, ఆగస్టు 28 : స్టాక్‌మార్కెట్లో ఇవాళ(శుక్రవారం) కూడా నిన్నటి ట్రెండ్ కొనసాగుతోంది. సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా లాభపడి 26644 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 100 పాయింట్లు లాభపడి 8066 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లు బలపడటమే లాభాలకు ప్రధాన కారణం. అటు బులియన్ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. వెండి ధర మాత్రం పెరిగింది. పది గ్రాముల మేలిమి బంగారం ధర రూ.26,291గా పలుకుతోంది. కిలో వెండి రూ.34,040గా ఉంది. డాలర్ మారకం విలువ రూ.66 గా ఉంది. అటు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచెమురు ధర స్వల్పంగా పెరిగింది