బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్ప
పీడనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షంతో హైదరాబాద్ తడిసి ముద్దవుతోంది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. ఉత్తర వాయువ్య, మధ్య బంగాళా ఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం తో వచ్చే 48 గంటల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్ నిజామాబాద్ ఖమ్మం, కరీంనగర్ వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని చెప్పింది.
తెలంగాణ వ్యాప్తంగాభారీ వర్షం




