Tuesday, 3 November 2026

భార్యను చంపిన కసాయి భర్త

కర్నూలు: అగ్నిసాక్షిగా తాళి కట్టిన భర్తే భార్య పాలిట యముడయ్యాడు. భార్యపై అనుమానం వచ్చి.. గొడ్డలితో నరికి చంపాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం బంగినాయినిపల్లిలో కలకలం సృష్టించింది.

బోయ వెంకటరమణ, చోళత్తమ్మకు తొమ్మిదేళ్ల క్రితం వివాహం అయింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న వెంకటరమణ గురువారం అర్ధరాత్రి గొడ్డలితో ఆమెపై దాడికి దిగాడు. భార్యను నరికిన తర్వాత వెంకటరమణ తానే చంపేశానంటూ పెద్దగా కేకలు వేశాడు. ఇది విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు నిందితుడిని శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. భార్యపై అనుమానంతోనే చంపానని అతడు చెప్పినట్టు తెలిసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *