యైటింక్లయిన్ కాలని, నవంబర్, 18 (జనంసాక్షి) : కట్టుకున్న భర్త కాలయముడై భార్యను కడతేర్చిన సంఘటన కాలనిలోని రాజీవ్‌నగర్ తండాలో జరిగింది. సంఘటనకు సంబంధించిన పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ధనమ్మ భర్త ధర్మయ్య రాజీవ్‌నగర్ తండాలో నివాసము ఉండే వారని వీరిద్దరి మధ్యలో గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నట్లుగా తెలిపారు. అలాగే ధర్మయ్యకు సరియైన సమయంలో అన్నం పెట్టడం లేదని అనారోగ్య రీత్యా సరియైన మందులు ఇవ్వడలేదని అట్టి గొడవ శనివారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగిందని తెలిపారు. ధర్మయ్య పథకం ప్రకారం ఆమె నిద్రపోతున్న సమయంలో తెల్లవారుజామున సుమారు 4గంటల ప్రాంతంలో ఆమె తలపై రోకలిబండతో కొట్టడంతో ఆమె అక్కడిక్కడే మరణించింది. ధనమ్మ మృతి చెందినట్లు నిర్ధారించుక్నున్న ధర్మయ్యనేరుగా తన కూతురి వద్దకు వెళ్లి అమ్మను చంపానని చెప్పి అక్కడి నుండి పారిపోయినట్లు తెలిపారు. కాగా ఉద్యోగ విరమణ పొందిన ధర్మయ్య అనేక అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నాడని తెలిపారు. కాగా సంఘటన స్థలాన్ని రెండవ టౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని సీఐ గాండ్ల వెంకటేశ్వర్లు, ఎస్సై సహదేవ్‌సింగ్‌లు మృతదేహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కోన్నారు. ఆనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు ఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.




