-మాజీ ఎమ్మేల్యే సోమారపు సత్యనారాయణ
యైటింక్లయిన్ కాలని, నవంబర్, 18 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఇబ్బందిపడకుండా చూడాలనే ఉద్దేశ్యంతోనే టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని మాజీ ఎమ్మేల్యే సోమారపు సత్యనారాయణ అన్నారు. శనివారం రాత్రి న్యూమారేడుపాకలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత 60 సంవత్సరాలుగా తెలంగాణను అన్ని విధాలుగా నష్టపరిచారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్ అన్ని కులసంఘాలకు ఉపాధి అవకాశాలు, రైతులకు 24గంటలతోపాటు కరెంటు, మిషిన్ కాకతీయ ద్వారా చెరువుల పూడికతీత తదితర పనులను చేయడంతోపాటు అభివృద్ది పరచడం జరిగిందన్నారు. అలాగే మిషిన్ భగిరథలో ప్రతి ఇంటికి త్రాగునీరు అందివ్వడంతో వేల ఎకరాలకు సాగునీరు అందించేలా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం జరుగుతుందని అన్నారు. రైతులను ఆదుకునే విధంగా పంట రుణాన్ని ఇచ్చి వారిని ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. ఆలాగే టీఆర్ఎస్ పార్టీలో పలువురు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వనించారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు రవినాయక్, మందల కిషన్రెడ్డి, శ్రీనివాస్, కొత్వాల రాజయ్య, పోయిల సంపత్, బద్రి దేవేందర్,, కార్యకర్తలు పాల్గొన్నారు.




