Thursday, 5 November 2026

భీమవరంలో ఉపాధ్యాయుల ఆందోళన

ఏలూరు, మార్చి 22 : ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఏలూరులో ఎమ్మెల్సీ అభ్యర్థి ఆర్‌.సూర్యారావు ఓటు గల్లంతు కావడంతో ఆయన ఆందోళనకు దిగారు. ఓటురు జాబితాలో తన పేరు లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. తమ ఓటును వేరే వారు వేశారని ఆరోపిస్తూ పోలింగ్‌ కేంద్రం వద్ద ఆందోళన నిర్వహించారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు రంగప్రవేశం చేసి వారికి సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు. మరోవైపు కృష్ణా, గుంటూరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటి వరకు పదిశాతం పోలింగ్‌ నమోదైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *