హైదరాబాద్: మిజోరంలో మొదటి స్వైన్ఫత్లి కేసు నమోదైంది. ఒక మహిళకు స్వైన్ఫత్లి లక్షణాలు ఉన్నట్లు గుర్తించినట్లు అక్కడి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. తీవ్ర జలుబు, జ్వరంతో బాధపడుతున్న నలుగురి నమూనాలను పరిశీలన నిమిత్తం ల్యాబ్‌కి పంపగా, ఒకరికి స్వైన్ఫత్లి ఉన్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. ఆ మహిళకు చికిత్స అందించామని, ప్రస్తుతం ఆమె కోలుకుంటోందని వారు పేర్కొన్నారు.




