Wednesday, 4 November 2026

భూసేకరణ ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలి

kivpx36tభూసేకరణ బిల్లుకాదు, భూఆక్రమణబిల్లు: ప్రకాశ్‌కరత్‌

విశాఖ, ఏప్రిల్‌ 15 : భూసేకరణ ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని సీపీఎం జాతీయ కార్యదర్శి ప్రకాశ్‌ కరత్‌ డిమాండ్‌ చేశారు. భూ సేకరణ బిల్లు అనేకంటే భూ ఆక్రమణ బిల్లు అంటే సరిపోతుందని ఆయన ఘాటుగా విమర్శించారు. విశాఖలో జరుగుతున్న సీపీఎం 26వ జాతీయ మహాసభల్లో రెండవ రోజైన బుధవారం రాజకీయ ఎత్తుగడలపై చర్చించారు.

ఈ సందర్భంగా ప్రకాశ్‌కరత్‌ మీడియాతో మాట్లాడుతూ భూ సేకరణ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా సమావేశంలో తీర్మానం చేసినట్లు చెప్పారు. కేంద్రం, నరేంద్ర మోదీ స్వయంగా ఇచ్చిన వాస్తవాలను కప్పిపుచ్చేలా ఉన్నాయని ఆయన అన్నారు. ఇది రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకమైదని, బడా పెట్టుబడుదారులకు అనుకూలంగా ఉందని కరత్‌ విమర్శించారు. ఈ బిల్లును పూర్తిగా ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *