Monday, 2 November 2026

భూసేకరణ చట్ట సవరణలివే..

, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం సూచిం చిన మూడు సవరణలతో భూసేకరణ, పునరావాస చట్ట సవరణ బిల్లును రాష్ట్ర అసెంబ్లీ ఆదివారం ఆమోదించింది. అభివృద్ధి పనుల భూసేకరణలో జాప్యాన్ని నివారించడం, బాధితులకు తక్షణ ప్రయో జనం కలిగించేందుకు ఈ బిల్లును తీసుకొ చ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. గతంలో రాష్ట్ర శాసనసభ ఆమోదించిన భూసేకరణ చట్టాన్ని కేంద్రం ఇప్పటికే  సూత్రప్రాయంగా ఆమోదిస్తూ కొన్ని సవరణలను సూచిం చింది.

ప్రాజెక్టులు, ఇతర ప్రజోపయోగమైన అభివృద్ధి పనులు చేపట్టే సమయంలో సామాజిక ప్రభావ అంచనా(సోషల్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌) పేరిట కాలయాపన లేకుండా చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం. ఇందుకు చట్టంలోని కొన్ని సాంకేతిక అంశాలను.. అది కూడా పదాల కూర్పులో కొన్ని మార్పులను సూచించింది.

బిల్లులో పేర్కొన్న ముఖ్యమైన అంశాలపై కేంద్రం సానుకూలంగానే ఉందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కేంద్రం సూచించిన మేరకు మూడు సవరణలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మూడింటికి భూసేకరణ చట్టంలో చోటు కల్పించేందుకు సాంకేతిక కారణాలతో మరో రెండు చిన్న సవరణలను జోడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *