హైదరాబాద్: నెల రోజుల్లోగా రాష్ట్రంలోని రహదారులపై గుంతలన్నీ పూడ్చివేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. నెల తర్వాత కూడా గుంతలు కనిపిస్తే సంబంధిత అధికారులను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. రహదారుల పరిస్థితిపై ఈరోజు ఆర్ అండ్ బీ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఇటీవల తాను వరంగల్ పర్యటనకు వెళ్లినప్పుడు పాలకుర్తి వరకు రహదారిపై అనేక గుంతలు కనిపించాయని.. గుంతలు ఎప్పటికప్పుడు పూడ్చాలని గతంలో చెప్పినా అధికారులు సీరియస్‌గా తీసుకోలేదన్నారు. రహదారుల మరమ్మతులు నిరంతరం జరుగుతూ ఉండాలని ఆదేశించారు.
రోడ్లపై గుంతలు కనిపిస్తే సస్పెండ్ చేస్తా




