Tuesday, 3 November 2026

భూసేకరణ బిల్లును రాజ్యసభలో వ్యతిరేకిస్తాం:వీహెచ్‌

bps13qb0హైదరాబాద్‌, మార్చి 22 : అన్ని రాజకీయపార్టీలతో మాట్లాడి, రైతులకు అన్యాయం జరగకూడదని, 80 శాతం మెజారిటీ రైతులను అడిగి… వాళ్లు అంగీకరిస్తే భూములు తీసుకోవాలనేది యూపీఏ ప్రభుత్వం చట్టం చేసిందని ఆ పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు వెల్లడించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ యూపీఏ చేసిన చట్టాన్ని మార్చేసి, రైతులకు ఇష్టమున్నా, లేకపోయినా ఏ భూమి అయినా తీసుకోవాలని వీరి ఆలోచనా సరైనదికాదని, ఈ విధంగా చేస్తే రైతులకు అన్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆలోచన కూడా ఇదేనని ఆయన అన్నారు.

యూపీఏ హయాంలో అన్ని రాజకీయ పార్టీల సూచనలు తీసుకున్నామని, అన్ని పార్టీలు ఒప్పుకున్న తర్వాతనే బిల్లు చేశామని వీహెచ్‌ స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్‌ సమావేశాలకు ముందే రాష్ట్రపతి ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చి భూ సేకరణ బిల్లును లోక్‌సభలో పెట్టిందని, దీనిని రాజ్యసభలో తప్పకుండా అడ్డుకుంటామని ఆయన అన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్‌ కూడా రెండు నాల్కల ధోరణిగా వ్యవహరిస్తున్నారని వీహెచ్‌ విమర్శించారు. ఏపీలో బిల్లుకు వ్యతిరేకంగా ధర్నా చేసి, ఢిల్లీ వచ్చిన తర్వాత మాట మార్చారని ఆయన దుయ్యబట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *