Tuesday, 3 November 2026

భూ సేకరణ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన

భూ సేకరణ ఆర్డినెన్స్‌ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసనలు కొనసాగాయి. ఇవాళ లోక్ సభలో భూ ఆర్డినెన్స్ చర్చకు రానుండంతో కాంగ్రెస్ కార్యకర్తలు చండీఘడ్‌లో నిరసన తెలిపారు. ఆందోళన కారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కెనాన్‌లు ఉపయోగించారు. అయినప్పటికీ ఆందోళన కారులు శాంతించకపోవడంతో వారిని అరెస్ట్ చేశారు. ఎన్డీయే సర్కారు తీసుకువస్తున్న భూ సేకరణ బిల్లు రైతులకు నష్టం చేకూర్చేలా ఉందని కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఆందోళనలో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *