అదే దారిలో కూరగాయలు
హైదరాబాద్,జూలై13(జనం సాక్షి): నిత్యం కూరల్లో వాడే ఉల్లిగడడ్డ ధరలు మళ్ల ఈరోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం 20 నుంచి 24 రూపాయల వరకు అమ్ముతున్నారు. ఇటీవల 12 నుంచి 15 రూపాయలకు చేరుకున్నా మళ్లీ పెరుగుదలకే మొగ్గు చూపుతున్నాయి. తప్పకుండా వాడే టమాటాల ధరలు కూడా మెల్లగా పెరుగుతున్నాయి. ఒక్కోచోట పరిస్థితులను బట్టి ప్రస్తుతం ధరలు ఎగబాకాయి. కనీసంగా ఇప్పుడు 24 రూపాయలకు ధరలు చేరుకున్నాయి. పంటలు విపరీతంగా పండే చిత్తూరు జిల్లాలో సైతం ధరలు మండుతున్నాయి. మదనపల్లిలో పంటలు లేకపోవడంతో అక్కడా ధరలు పెరిగాయి. మదనపల్లిలో దిగుబడులు బాగా ఉంటే ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఇబ్బంది ఉండే అవకాశాలు ఉండదు. అయితే అక్కడ దిగుబడి తక్కువగా ఉండటం, జిల్లాలో ప్రస్తుతం పంట లేకపోవడంతో ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. నెల రోజుల క్రితం రైతుబజార్లలో కిలో రూ.20లు ఉన్న టమాటా ధరలు పెరిగిపోయాయి. మదనపల్లిలో ఈ ఏడాది పంట దిగుబడి తగ్గటంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలపై ఆ ప్రభావం పడింది. దీంతో ధరలు ఒక్కసారిగి పెరిగిపోవడంతో అమ్మకాలు సగానికి తగ్గిపోయాయి. ఇదే స్థాయిలో కూరగాయల ధరలు ఉన్నాయి. 20 నుంచి 30కి కిలో తక్కువగా అమ్మడం లేదు. తెలంగాణాలో గజ్వెల్ ప్రాంతంలో బాగా పంటలు పండుతాయి. అక్కడా సమస్యలు రావడంతో దిగుబడి తగ్గింది. పంట అందుబాటులో ఉండటంతో అక్టోబర్ నుంచి మార్చి వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఫిబ్రవరి నుంచి పంట కూడా అందుబాటులోకి రావడంతో వేసవి కాలంలో సైతం సామాన్యులకు అందుబాటులోనే ఉంటాయి. ఈ యేడు ఎండాకాలం సీజన్ జూలై మొదటి వారం వరకు కొనసాగడం కూడా ప్రతికూల పరిస్తితిగానే భావించాలి. సాధారణ రోజుల్లో కేజీ కొనుగోలు చేసేవారు ప్రస్తుత ధరలకు బయపడి చిన్న మొత్తాల్లో కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వంధరల నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటే తప్ప స్థానిక పంట అందుబాటులోకి వచ్చే వరకు ఇదే పరిస్థితి ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. అలాగే సీజన్‌ను బట్టి పంటలు వేయడానికి మార్గాలను అన్వేషించాల్సి ఉంది. పంటల దిగుబడి తగ్గకుండా పంటల నిర్వహణ ఉండాలి.
————————




