మండల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడిగా జిల్లేపల్లి శ్రీనివాస్ ఎన్నిక

మునగాల మండల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడిగా జిల్లేపల్లి శ్రీనివాస్ నియామక పత్రాన్ని నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం హుజుర్ నగర్ లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో అందజేశారు. ఈ సందర్భంగా జిల్లేపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో మండల బాధ్యతలు అప్పచెప్పినందుకు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతిలకు,జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బైరు శైలేందర్ గౌడ్ లకు ధన్యవాదాలు తెలిపారు. మండలంలో కాంగ్రెస్ పార్టీ కొరకు నిరంతరం శ్రమిస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొలిశెట్టి బుచ్చిపాపయ్య, బచ్చు అశోక్, జిల్లా కార్యదర్శి కాసర్ల కోటేశ్వరరావు, జిల్లా ఐఎన్టియూసి జనరల్ సెక్రటరీ హరిబాబు తదితరులు పాల్గొన్నారు.